HomeTelugu Newsపెళ్లి వేడుకలే కడుపు నింపేవి: కపిల్‌ శర్మ

పెళ్లి వేడుకలే కడుపు నింపేవి: కపిల్‌ శర్మ

4 31ప్రముఖ బాలీవుడ్‌ హాస్యనటుడు కపిల్‌ శర్మ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి గిన్నీ ఛత్రత్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా శుభలేఖను కూడా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కాలేజ్‌ రోజుల్లో పెళ్లి వేడుకలే తమ కడుపు నింపేవని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కపిల్‌.

‘నేను ఢిల్లీలో చదువుకునేటప్పుడు ఎక్కడ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని తెలిసినా నా స్నేహితులతో కలిసి వెళ్లేవాడిని. కేవలం భోజనం కోసమే వెళ్లేవాళ్లం. ఎవ్వరికీ అనుమానం రాకుండా పెళ్లి తరఫు వాళ్లమని చెప్పేవాళ్లం. ఓసారి పెళ్లిలో ఓ అంకుల్‌ మమ్మల్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కంగారులో నా స్నేహితుడు కాలేజ్‌ మెస్‌లో భోజనం అయిపోతే ఇక్కడికి వచ్చామని నోరుజారాడు. అయితే అప్పటికి మేమింకా భోజనం చేయలేదు. దాంతో ఆ అంకుల్‌ మమ్మల్ని తినమని చెప్పి డ్యాన్స్‌ కూడా చేయాలని పట్టుబట్టాడు. దాంతో మేం రెండింతలు ఎక్కువే తిన్నాం. ఈ అనుభవాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను’ అని వెల్లడించారు కపిల్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu