HomeTelugu Big Stories'కాంతార చాప్టర్‌-1' ఫస్ట్‌లుక్‌ విడుదల

‘కాంతార చాప్టర్‌-1’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Kantara Chapter 1 First Loo
క‌న్న‌డ న‌టుడు రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్‌ ‘కాంతార చాప్టర్ -1’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటివ‌లే షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం ఈ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్‌ను అందించింది.

కాంత‌ర ఛాప్ట‌ర్ 1 నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది. దీనితో పాటు ఒక టీజ‌ర్ కూడా విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. రిషబ్ శెట్టి క్లైమాక్స్ సీన్‌తో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ మొద‌లుకాగా.. కదంబల జన్మించిన ఓ లెజెండ్ అంటూ కండలు తిరిగిన దేహంతో.. బాడి అంతా రక్తపు మరకలు బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి క‌నిపిస్తాడు.

ఇక ప్రీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రిషబ్‌ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారు, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి అంశాలను హైలెట్ చేసి చూపించబోతున్నట్లు వినికిడి‌. ఈ సినిమా కోసం రిషబ్‌ గ్రౌండ్‌వర్క్‌ చాలానే చేసిన‌ట్లు తెలుస్తుంది.

హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu