ఇంత ప్రతిష్టాత్మకమైన చిత్రంలో శివరాజ్‌కుమార్ నటించడం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివరాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు కానుకగా ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ ఫస్ట్‌లుక్‌ను ఆయనతల్లి పార్వతమ్మ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. ”కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌గారు మా సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగువారి గొప్పతనాన్ని తెలియజేసే శాతకర్ణి చక్రవర్తి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణగారిపైఅభిమానంతో శివరాజ్‌కుమార్‌గారు అతిథిపాత్రలోనటించడానికి ఒప్పుకున్న శివరాజ్‌కుమార్‌గారికి థాంక్స్. లెజెండ్రీ నటుడు రాజ్‌కుమార్ ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరూ ఇతర భాషా చిత్రాల్లో నటించలేదు. తొలిసారి శివరాజ్‌కుమార్ తెలుగులో నటించడం విశేషం. శివరాజ్‌కుమార్‌గారి తల్లి పార్వతమ్మగారి పుట్టినరోజు సందర్భంగా గౌతమిపుత్ర శాతకర్ణిలో శివరాజ్‌కుమార్‌గారి ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నాం” అన్నారు.
