ప్రముఖ సీనియర్ నటుడు రాజేశ్(89) కన్నుమూశారు. ఆయనను శాండల్ వుడ్ లో కళా తపస్వి అని కూడా పిలుస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 19 తెల్లవారుజామున 2.03 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాజేశ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కర్ణాటక విద్యారన్యపురలోని తన నివాసానికి తరలించనున్నారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
రాజేశ్ అసలు పేరు విద్యాసాగర్. ఈయన 1935లో బెంగళూరులో జన్మించిన ఆయన వీర సంకల్ప సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1968లో వచ్చిన నమ్మ ఒరు సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. 1960, 70 దశకాల్లో వచ్చిన పలు చిత్రాల్లో హీరోగా అలరించిన ఆయన ఆ తర్వాతి కాలంలో సహాయక పాత్రలు పోషించారు. 45 ఏళ్ల సినీప్రయాణంలో సుమారు 150 సినిమాల్లో నటించారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు వీరిలో ఆశారాణి.. నటుడు అర్జున్ సర్జా భార్య భార్య.