HomeTelugu Trendingప్రముఖ నిర్మాతకు కరోనా!

ప్రముఖ నిర్మాతకు కరోనా!

5 7

ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు కూడా సోకిందని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు హిట్‌ సినిమాలను నిర్మించిన ఆయన శ్యాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వృత్తిరీత్యా డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని అభిలాష్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్‌వుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన రాక్‌లైన్‌ దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతో కలిసి సీఎం యెడియూరప్పను కలిశారు

సమలతకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెకు నిర్థారణ అయిన రెండు రోజుల్లోనే రాక్ లైన్ వెంకటేష్ కూడా అనారోగ్యం బారిన పడటంతో ఆయనకు టెస్ట్ నిర్వహించారట. ఆ టెస్టులో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చిందని కన్నడ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఆరోగ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాని కారణంగా పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu