కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘కంగువ’ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. సూర్య 42గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేయగా.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. మరోవైపు కంగువ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టన్నింగ్ అప్‌డేట్ వచ్చేసింది. కంగువ ప్రోమో జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్‌ప్రైజ్ ప్లాన్.. రెడీగా ఉండండి.. అని అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే ప్రోమో ఉంటుందని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్, ఫ్యాన్స్. ఈ మూవీని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్‌లో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. 2024 ప్రథమార్థంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కంగువ సీక్వెల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
MASSIVE #Kanguva surprise planned for July 23rd. pic.twitter.com/0cscbICZ1B
— Manobala Vijayabalan (@ManobalaV) July 12, 2023