Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఉండే ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం సూర్య.. శివ దర్శకత్వంలో ‘కంగువా’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకూ విడుదలైన అప్డేట్స్ కూడా ఈ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌లపై ఈ మూవీని కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ కథ టాలీవుడ్ సినిమా పోలి ఉంటుంది అనే ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. ఈసినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఈసోషియో ఫాంటసీ ఎలిమెంట్ తో కూడిన టైం ట్రావెల్ తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ ఇందులో డబుల్ రోల్ ప్లే చేశాడు.
ఒకటి పాజిటివ్ రోల్, ఇంకోటి మొదట నెగిటివ్ గా ఉండి తర్వాత పాజిటివ్ గా మారే రోల్. రెండు పాత్రల్లోనూ కళ్యాణ్ రామ్ నటన సూపర్. అయితే ఇప్పుడు ఇలాంటి కథలో మరో వస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. అయితే ఒకే కథతో వచ్చినా టేకింగ్ బాగుంటే ఏ సినిమాని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే చెప్పాలి.