బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న నేపధ్యంలో డ్రగ్స్ కోణం బయటపడంతో… దీనిపై దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రోజు రోజుకు పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ నటీనటుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు కూడా డ్రగ్స్ వినియోగం కేసులో ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాకుండా శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌లకు కూడా సమన్లు జారీ అవుతాయని తెలుస్తోంది. ఆమె పేరు బయటకు రావడంతో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన సినీనటి కంగనా రనౌత్ విమర్శలు గుప్పించింది.
‘డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్‌గా కనబడుతున్న కొందరు స్టార్ల పిల్లలు వాళ్ల మేనేజర్లను మాల్ గురించి అడుగుతుంటారు’ అని కంగన చురకలంటించింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికా పదుకొణేను బాయ్‌కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్‌ట్యాగ్ జోడించింది. కాగా, గతంలో దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లి కోలుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కంగనా ఈ ట్వీట్ చేసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు డ్రగ్స్ డీలర్లను అధికారులు విచారించగా బాలీవుడ్‌లో ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి.
Repeat after me, depression is a consequence of drug abuse. So called high society rich star children who claim to be classy and have a good upbringing ask their manager ,” MAAL HAI KYA?” #boycottBollywoodDruggies #DeepikaPadukone https://t.co/o9OZ7dUsfG
— Kangana Ranaut (@KanganaTeam) September 21, 2020