బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సెలబ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రోజు సంచలన వ్యాఖ్యలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కంగనా మరోసారి రెచ్చిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ సంబంధంపై నోరు విప్పింది. ఇంతకముందు కూడా సుశాంత్ సారా వీడిపోవడానికి బాలీవుడ్ బంధుప్రీతి కారణమని కంగనా చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ..
సుశాంత్, సారా అలీఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కూతురు) ఇద్దరూ ప్రేమలో ఉన్నారని… వారిద్దరూ విడిపోవడానికి కరీనానే కారణమని అన్నారు.. ఇపుడు ఇదే గ్యాంగ్ మూవీ మాఫియా తనను కూడా లక్ష్యంగా పెట్టుకుందని కంగనా రనౌత్ స్పష్టం చేసింది. సుశాంత్‌తో డేటింగ్ చేయవద్దని సారాను తన సవతి తల్లి కరీనా కపూర్ కోరినట్లు పేర్కొన్నారు. ‘నీ మొదటి హీరోతో డేటింట్ చేయకు’ అని కరీనా చెప్పిన రికార్డ్ కూడా ఉందన్నారు. సుశాంత్ బయటి వ్యక్తి కాబట్టి అతన్ని ఇండస్ట్రీ ఎగతాళి చేసిందని, మూవీ మాఫియా బహిరంగంగానే అతనిని హత్య చేసిందన్నారు. దాంతో మానసిక కుంగుబాటుకు లోనైన సుశాంత్‌పై రాబంధుల సమూహం వచ్చి అనుకున్నది చేసిందన్నారు.