HomeTelugu Trendingకంగనాకు అత్యాచార బెదిరింపులు..

కంగనాకు అత్యాచార బెదిరింపులు..

Kangana Ranaut to gets rapeబాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు వరుస షాక్‌లు ఎదురౌతున్నాయి. ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్‌ ద్వారా స్పందించిన కంగనా వ్యంగ్యంగా కామెంట్‌ చేసింది. ‘నవరాత్రి వేళ ఎవరు ఉపవాసం ఉన్నారు? ఈ రోజు వేడుకల నుంచి ఫోటోలు ఇవి. ఇక నాపై మరొక కేసు నమోదైంది. మహారాష్ట్రలోని పప్పు సేనకు నాపై మక్కువ ఎక్కువై పోయిందనిపిస్తుంది, నన్ను మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను’. అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌ తరువాత తాజాగా కంగనా రనౌత్‌కు ఒడిశాకు చెందిన న్యాయవాది నుంచి అత్యాచారం బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో ఉన్న కంగనా ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. అయితే తన ఖాతా హ్యాక్ చేశారని సదరు న్యాయవాది అనంతరం ఓ పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు నా ఫేస్‌బుక్ హ్యాక్ అయింది. అందులో నుంచి అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు చేశారు. స్త్రీలను, సమాజాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు నావి కాదు. వీటిని చూసి నేను కూడా చాలా షాక్ అయ్యాను. వీటి వల్ల ఎవరి మనోభావాలు అయిన దెబ్బతింటే నన్ను క్షమించండి అని కోరారు. అనంతరం తన ఫేస్‌బుక్ ఖాతాను తొలగించారు.

Kangana Ranaut gets rape threats from Lawyer

Recent Articles English

Gallery

Recent Articles Telugu