బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న’తలైవి’ సినిమాలో నటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు కంగన ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ‘ప్రస్తుతం నేను తలైవి సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నాను. నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కిస్తాను. ఒకవేళ అది కుదరకపోతే.. నా జీవితం గురించి ఒక పుస్తకమైన రాయిస్తాను. నా సోదరి రంగోలీ మాత్రమే నా జీవితం గురించి పుస్తకం రాయగలదు. ఎందుకంటే చిన్నతనం నుంచి బాలీవుడ్లో హీరోయిన్ స్థాయికి వచ్చే వరకు తను నన్ను చూసింది. నేను ఎదుర్కొదన్న కష్టాలు గురించి తనకు బాగా తెలుసు’ అని కంగన పేర్కొన్నారు.