డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. షారుక్ కుటుంబంతో రోజూ టచ్‌లో ఉన్న సల్మాన్ కూడా తన పూర్తి మద్దతు అందిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా హీరో హృతిక్ రోషన్ కూడా ఆర్యన్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన అనుభవాలను సొంతం చేసుకోవాలని మరియు తన తప్పులు వైఫల్యాల నుండి ఎంతగానో నేర్చుకోవాలని హృతిక్ ఆర్యన్‌కు సున్నితంగానే మద్దతు అందించాడు. దీనిపై పలువురు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. హృతిక్ పేరును డైరెక్ట్‌గా చెప్పకుండా కౌంటర్‌గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
‘ఆర్యన్ ఖాన్‌ను రక్షించడానికి మొత్తం మాఫియా పప్పులు ఇప్పుడు రంగంలోకి దిగాయి. మనం తప్పులు చేస్తాం. కానీ వాటిని గొప్పగా చెప్పుకోం అని సంభోదిస్తున్నారు. ఈ తప్పు వల్ల కలిగే ఇబ్బందులు అతని దృక్పథాన్ని మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నా. వారు తప్పు చేయలేదని వారికి అనిపించడం అదొక నేరం.. అంటూ ఇలా మద్దతు ఇస్తే భవిష్యత్తులో అతనికి మరో పర్యవసానంగా మారే అవకాశం ఉంటుంది. అతను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడం మంచిది కాదు’ అని అందులో కంగనా ఘాటుగా విమర్శించింది.
హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్‌తో విడిపోయిన తర్వాత కంగనాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో ఈ జంట విడిపోయారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు ఏదో రూపంలో తమ ఆగ్రహాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. ఆర్యన్‌కి సపోర్టుగా హృతిక్ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే కంగనా స్పందించింది. ఇది హృతిక్‌కి కౌంటరేనని నెటిజనులు అనుకుంటున్నారు.