టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ ను పోకిరి సినిమా మలుపు తిప్పింది. ఈ సినిమా వచ్చి 14 ఏళ్ళు పూర్తయింది. ఈ సినిమాతో మహేష్, పూరీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇక ఈ సినిమాతో గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈ సినిమా గురించి బాలీవుడ్ నటి కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఈ సినిమాలో కంగన హీరోయిన్‌గా నటించాల్సిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గ్యాంగ్‌స్టర్’ అనే సినిమా ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలోనే ‘పోకిరి’ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. రెండింటికీ నేను హాజరయ్యాను. రెండు సినిమాల్లోనూ నాకు అవకాశం వచ్చింది. అయితే ముందుగా ‘గ్యాంగ్‌స్టర్’ కు డేట్లు ఇచ్చేయడంతో ‘పోకిరి’ చేయలేకపోయాను. లేకపోతే టాలీవుడ్‌లో నేను పెద్ద హీరోయిన్ అయ్యుండేదాన్ని’ అని కంగన తెలిపింది. ఇక పూరీజగన్నాద్ దర్శకత్వం వహించిన ఏక్ నిరంజన్ సినిమాలో కంగనా నటించిన విషయం తెలిసిందే.