బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ముంబై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆమె విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. దీంతో వసేన కీలక నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్.. తమ అధికార పత్రిక సామ్నాలో విరుచుకుపడ్డారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే.. ముంబై మహానగరంలో అడుగుపెట్టొందంటూ అధికార పత్రిక సామ్నాలో రాశారు.
సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై కంగనా మండిపడింది. ముంబైలో అడుగుపెట్టవద్దని సంజయ్ రౌత్ నాకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు. ఈయన వ్యాఖ్యలు చూస్తుంటే.. ముంబై మహానగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ చేసిన ఫిర్యాదులను అప్పట్లో ముంబై పోలీసులు పట్టించుకోకవడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొంది. మరోవైపు తనకు రక్షణ విషయంలో ముంబై పోలీసులపై నమ్మకం లేదంటే.. ముంబైను బాలీవుడ్‌ను ద్వేషించినట్టు కాదని పేర్కొంది. అయితే కంగనా ఈ రోజు మరో ట్విట్ చేసింది. అందులో… ముంబైకి తిరిగి రాకూడదని చాలా మంది నన్ను బెదిరిస్తున్నారు. కాబట్టి నేను ఈ నెల 9న ముంబైలో అడుగుపెడుతున్నాను. ఎవరికైనా దమ్ముంటే నన్ను ఆపే ప్రయత్నం చేయండి అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో పాటు ఈ పార్టీ శ్రేణులకు సవాల్ విసిరింది. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.