బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించిన మణికర్ణిక చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ది లెజెండ్ ఆఫ్ దిద్దా’ సినిమాను తెరకెక్కించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో మణికర్ణిక సీక్వెల్‌ను రూపొందించబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించి ప్రిప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కూడా మణికర్ణిక నిర్మాత కమల్‌జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా కశ్మీర్ రాణిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కంగనా నటించిన జయలలిత బయోపిక్ తలైవి సినిమా ఇప్పటికే పూర్తయింది.