బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ పథకం ప్రకారం అంతా చేశారని, ఇలాంటి రోజు వస్తుందని ఆమె ముందే ఊహించారని దర్శకుడు క్రిష్ అన్నారు. ‘మణికర్ణిక’ సినిమా డైరెక్షన్ క్రెడిట్ కంగన తీసుకోవడంపై ఇటీవల క్రిష్ ఓ ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్క్రిప్టులో మార్పులు చేయాలని ఒత్తిడి చేశారని ఆయన పేర్కొన్నారు. నటుడు సోనూసూద్ వివాదం విషయంలోనూ కంగన అబద్ధాలు చెప్పారని, మూర్ఖంగా, తప్పుగా ప్రవర్తించారని క్రిష్ చెప్పారు. ఆమె పాత్రలా మిగిలిన పాత్రలు కూడా బలంగా ఉండటం ఇష్టంలేక వాటిని కట్ చేయించారని కూడా తెలిపారు. తను బంగారం తీస్తే.. ప్రేక్షకులకు వెండి చూపించారని క్రిష్ ఆవేదన చెందారు.
దీంతో ఈ వివాదంపై కాస్త ముదిరింది. కంగన సోదరి రంగోలి.. క్రిష్‌పై మండిపడ్డారు. ‘మణికర్ణిక’ విజయాన్ని ఆస్వాదించే అవకాశం కంగనకు ఇవ్వమని ట్వీట్ చేశారు. అంతేకాదు తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘ఎన్.టి.ఆర్’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ‘మణికర్ణిక’కు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నువ్వు అన్నావ్ క్రిష్.. మరి దీన్ని ఏం అంటారు?’ అంటూ కంగన ఆయనకు చేసిన వాట్సాప్ సందేశాల స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. దీన్ని చూసిన క్రిష్ ట్విటర్‌లో స్పందించారు.
‘మరొక వ్యక్తిపై అబద్ధాలు చెప్పి, తప్పుడు ఆరోపణలు చేసి నా ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఏంటో నిరూపించుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. రంగోలీ.. సినిమా క్రెడిట్ తీసుకోవడం, సినిమాకు చేసిన నష్టం గురించి నేను మీ సోదరిని (కంగన) ప్రశ్నించినప్పుడు ఆమె నాకు చేసిన సందేశాలు ఇవి’ అని క్రిష్ ట్వీట్ చేశారు.
అదేవిధంగా.. ’85 శాతం నేను తీసినదే సినిమాలో ఉందని ‘మణికర్ణిక’ రెండు వెర్షన్‌లు (క్రిష్ ఎడిట్ చేసింది, కంగన ఎడిట్ చేయించింది) చూసిన టెక్నీషియన్ నాతో అన్నారు. ఆయన సందేశాలు ఇవిగో’ అంటూ టెక్నీషియన్ విక్కీ జిమ్మీ సందేశాలు షేర్ చేశారు.
‘నేను క్రెడిట్ గురించి ప్రశ్నించినప్పుడు కంగన చేసిన వాట్సాప్ సందేశాలన్నీ అబద్ధాలే. అంతేకాదు ఆమె ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించారు. దానికి తగ్గట్టు సిద్ధమయ్యారు’ అని క్రిష్ మరో పోస్ట్ చేశారు. అదేవిధంగా సినిమా ఎడిటర్ సూరజ్ చేసిన వాట్సాప్ సందేశాన్ని కూడా క్రిష్ షేర్ చేశారు. ఇక్కడ ప్రశ్న ఎవరు ఎంత షూట్ చేశారన్నది కాదని.. ఎవరి అభిరుచి ఎలా ఉందో తెలుసుకోవాలని అన్నారు. కనీసం ఇప్పటికైనా తన తప్పులను కంగన తెలుసుకోవాలని, అసహ్యంగా ప్రవర్తించడం ఆపాలని కోరారు. ఈ సినిమాకు సంబంధించి తనకు ఇంకా పూర్తి పారితోషికం ఇవ్వలేదని క్రిష్ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో తెలిపారు. నిర్మాతలు ఇంకా 70 శాతం పారితోషికం ఇవ్వాలని చెప్పారు.
I never thought I've to defend my ability of film making based on the manipulations and lies of one person. @Rangoli_A these messages were ur sister's words about me ehen I've questioned her about the credit and the damage she is doing to the movie.
— Krish Jagarlamudi (@DirKrish) January 30, 2019
I'm confidently saying that everything Kangana has written on those whats app messages when I've questioned her, are complete lies and pre prepared, as she has foreseen that this day will come.
— Krish Jagarlamudi (@DirKrish) January 30, 2019
This is from the editor who edited n later replaced.. the question is not about who shot how much., but its about proceess which everything has been done with ulterior motive n with a poor taste. Pls realise ur lies r making things worse pic.twitter.com/QeA5aCDWtS
— Krish Jagarlamudi (@DirKrish) January 30, 2019
These r the future film makers I came out n spoke for, so that they wont face these humiliations.. pic.twitter.com/YV4YoAmrYm
— Krish Jagarlamudi (@DirKrish) January 30, 2019