బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ డిఫరెంట్ చిత్రాలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు అంశాన్ని బేస్ చేసుకుని ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్ర్కిప్ట్ సమకూరుస్తున్నారు. ‘అపరాజిత అయోధ్య’ పేరుతో వచ్చే ఏడాది
జనవరిలో ఈ చిత్రం ప్రారంభించేందుకు కంగనా సంసిద్ధమయ్యారని సమాచారం. మరోవైపు కంగనా నిర్మాతగా మారుతున్నారని ఆమె సోదరి రంగోలి చందేల్ ట్వీట్ చేశారు.
కంగనా త్వరలో అపరాజిత అయోధ్యగా రానున్నారని, దర్శకులు, నటీనటుల గురించి ప్రకటన చేస్తారని తెలిపింది. అపరాజిత అయోధ్య వైవిధ్యమైన చిత్రమని, నిర్మాణ రంగంలో అడుగుపెట్టేందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చారు. కంగనా చివరిసారిగా ఏక్తాకపూర్ నిర్మించిన జడ్జిమెంటల్ హై క్యా మూవీలో నటించింది. ఇప్పుడు
తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనా నటిస్తోంది. తలైవిగా కంగనా ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.