HomeTelugu Trendingకరణ్‌ జోహార్‌పై మరోసారి కంగన తీవ్ర వ్యాఖ్యలు

కరణ్‌ జోహార్‌పై మరోసారి కంగన తీవ్ర వ్యాఖ్యలు

Kangana and Karan
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్‌పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడింది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా కరణ్‌పై విమర్శలు చేస్తుంది కంగన. రణవీర్ సింగ్, అలియాభట్ జంటగా కరణ్ జొహార్ ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాను విమర్శిస్తూ ఇన్‌స్టాలో కంగనా రనౌత్ వరుస పోస్టులు పెట్టింది.

ఈ సినిమాలో రణవీర్ సింగ్ కాస్ట్యూమ్స్, కరణ్ దర్శకత్వంపై విమర్శలు చేసింది. రూ.250 కోట్లు ఖర్చు పెట్టి ఒక డైలీ సీరియల్ తీశారని.. ప్రేక్షకులను ఇంకెంత కాలం మోసం చేస్తారంటూ ప్రశ్నించింది. ఫేక్ కాస్ట్యూమ్స్‌ని, ఫేక్‌సెట్స్‌ని ప్రేక్షకులు అంగీకరించరని అంటూ రాసుకొచ్చింది.

సినిమాలో రణవీర్ సింగ్ ధరించిన దుస్తులను నిజ జీవితంలో ఎవరైనా ధరిస్తారా? 90వ దశకంలో నువ్వు తెరకెక్కించిన చిత్రాలనే మళ్లీ కాపీ కొట్టి రూ.250 కోట్లతో సినిమా చేసేందుకు సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Rocky aur rani

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా వెనుకబడింది. ఫస్ట్ డే రూ. 11 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. టాలెంట్ ఉన్నవాళ్లను పక్కన పెట్టి మీరు మాత్రం డబ్బులు వృధాగా కుమ్మరిస్తున్నారు.

డబ్బులు నాశనం చేసుకోకుండా పరిశ్రమ నుండి నిష్క్రమించు అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. అత్తాకోడళ్ల డ్రామాకు వందల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో గొప్ప ఫిలిం మేకర్ అనుకుంటున్నావు. అదేం లేదు.

హీరో రణ్‌వీర్ సింగ్‌కి నా సలహా ఏమిటంటే? కరణ్ జోహార్‌ని ఫాలో అవ్వొద్దు. అతనిలా బట్టలు వేసుకోకు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా మాదిరి బట్టలు వేసుకో. లేదంటే మన సౌత్ హీరోలను చూసి నేర్చుకో. నీ వస్త్రధారణతో మన సంస్కృతి నాశనం చేయకంటూ తీవ్రంగా మండిపడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu