HomeTelugu Newsమొదలైన 'ఇండియన్‌2'

మొదలైన ‘ఇండియన్‌2’

6 12యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ కలిస్తే క్రియేట్‌ అయ్యే సెన్సేషన్‌కు తరుణం ఆసన్నమైంది. గతంలో ఇండియన్‌(భారతీయుడు)తో సంచలనం సృష్టించిన వీరి కాంబినేషన్‌.. మళ్లీ ఇన్నాళ్లకు సీక్వెల్‌ రూపంలో ప్రకంపనలు సృష్టించేందకు రెడీ అయింది.

ఇప్పటికే ‘2.ఓ’కు సంబంధించిన పనులను పూర్తి చేశారు శంకర్‌. ఈ చిత్రం విడుదలైన తరువాత ‘ఇండియన్‌2’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ‘ఇండియన్‌2’కు సంబంధించిన పూజాకార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ​ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే మూవీయూనిట్‌ ప్రకటించనున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu