సూపర్ స్టార్ రజినీకాంత్ డిసెంబర్ 31న పోలీటిక్ ఎంట్రీ పై ప్రకటన చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు. దీనిపై మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. పార్టీ పెట్టకూడదన్న రజనీకాంత్ నిర్ణయం ఆయన అభిమానులలాగే తననూ తీవ్ర నిరాశకు గురి చేసిందని కమల్ హాసన్ అన్నారు. అయితే ఆయన ఆరోగ్యమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం తర్వాత రజినీకాంత్‌ను కలుస్తానని చెప్పారు.