కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ కొనసాగుతుంది. కాగా ఈ సమయంలో మందుబాబులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మద్యం షాపులు తెరవాడని స్టార్ హీరో కమల హాసన్ తప్పుబట్టారు. అయితే ఈ సమయం లో ఈ పని చేయడం ప్రజలను మరింత ప్రమాదంలోకి నెట్టడమే అని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజల ఆరోగ్యం పై బాధ్యత లేకుండా ఇలా చేయడం కమల్ మండిపడ్డారు. అయితే తమిళనాడు లో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సమయం లో వైన్ షాపులు తెరవడం వల్ల ప్రజలు అక్కడ గుంపుగా చేరుతారు అని కమల్ తెలిపారు. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు 40 రోజుల తరువాత వైన్స్ తెరవడంతో ప్రజలు అక్కడ గుమ్మిగూడుతున్నారు. అయితే రేపటి నుండి తెలంగాణలో కూడా వైన్స్ ఓపెన్ అవనున్నట్లు కేసీర్ తెలిపారు.