యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆయనకు చికిత్స అందిస్తోన్న శ్రీరామచంద్ర ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కమల్‌హాసన్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. ‘కమల్‌హాసన్ స్వల్ప కొవిడ్ లక్షణాలతో నవంబరు 22న మా ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడాయన కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయినా మరో రెండు రోజులు మా సంరక్షణలోనే ఉంటారు. డిసెంబరు 3న డిశ్చార్జ్ చేస్తాం. మరుసటి రోజు నుంచే ఆయన తన పనుల్ని పునఃప్రారంభించవచ్చు’ అని పేర్కొన్నాయి. ఇటీవల అమెరికా ట్రిప్ ముగించుకుని నగరానికి చేరుకున్న కమల్‌హాసన్ దగ్గు వస్తుండటంతో వైద్యుల్ని సంప్రదించారు. పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణకావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు.