ప్రముఖ నటుడు నటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం కాంచీపురంలో పర్యటించి తిరిగి హోటల్ కు కారులో వెళుతుండగా ఓ వ్యక్తి పీకలదాకా తాగి కమల్ హాసన్ కారు విండోని పగలగొట్టాడు. కమల్‌ను చూడాలంటూ అద్దాన్ని బ్రేక్ చేశాడు. ఈ ఘటనలో కమల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు కాని, కారు అద్దం బాగా దెబ్బతింది. కారుపై దాడి చేసిన వ్యక్తిని ఎంఎన్ఎం కార్యకర్తలు బంధించి దేహశుద్ది చేశారు. ఆ క్రమంలో అతని ముక్కు నుండి రక్తం కూడా కారింది. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.