స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో ‘ఇండియన్ -2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చెన్నై శివారులోని ఓ స్టూడియోలో షూటింగ్ చేస్తుండగా బుధవారం రాత్రి సడెన్ గా భారీ క్రేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కమల్, శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక లైట్ బాయ్ ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంపై హీరో కమల్ హాసన్ సంతాపాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హీరో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.