ప్రముఖ నటుడు కమలహాసన్ ఆసుపత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. నిన్న హైదరాబాద్
వచ్చిన కమల్.. తన గురువు, కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను తన
ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం నిన్న రాత్రే ఆయన చెన్నై
చేరుకున్నారు.
జ్వరంతో అస్వస్థతగా ఉండడంతో కమల్ శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ (ఎస్ఆర్ఎంసీ)లో చేరినట్టు తెలుస్తోంది. అయితే, రెగ్యులర్
హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. జ్వరానికి చికిత్స చేసిన వైద్యులు
రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ రోజు ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.