HomeTelugu TrendingKamal Haasan about Indian 2: ఇండియన్ 2 పై కమల్ హాసన్ వల్లే తగ్గిపోతున్న అంచనాలు

Kamal Haasan about Indian 2: ఇండియన్ 2 పై కమల్ హాసన్ వల్లే తగ్గిపోతున్న అంచనాలు

Kamal Haasan about Indian 2
Shocking comments of Kamal Haasan about Indian 2

Kamal Haasan about Indian 2:

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇండియన్ 2. 1996లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా ఇండియన్ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కూడా శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా లోని మొదటి భాగం అంటే భారతీయుడు 2 (ఇండియన్ 2) జూలై 19న థియేటర్లలో విడుదల కాబోతోంది.

తమిళ్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా మీద అంత ఆసక్తి రావడం లేదు. మరోవైపు గేమ్ చేంజర్ అప్డేట్ లు ఇవ్వడం లేదు అని శంకర్ పై తెలుగు ప్రేక్షకులు కొంత చిరాకులో ఉన్నారు. అందుకే శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 సినిమా పై కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు.

ఇదిలా ఉండగా చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్స్ అంటేనే సినిమా గురించి గొప్పగా మాట్లాడడం. కానీ కమల్ హాసన్ మాత్రం ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో భారతీయుడు 2 గురించి కొంత నెగిటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. దీంతో అసలే సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు అంటే కమల్ హాసన్ మాటలకి కనీసం తీయటానికి కూడా వెళ్లాలి అన్న ఆలోచన ప్రేక్షకులకి రావడం లేదు.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ తను అసలు ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణమే ఇండియన్ 3 అని చెప్పారు. ఇండియన్ 3 చేయాలన్న ఆలోచనతోటే ఇండియన్ 2 ఒప్పుకోవాల్సి వచ్చింది అన్నట్లు మాట్లాడారు కమల్ హాసన్. దీంతో ఇండియన్ 3 లోనే కథ మొత్తం ఉంటుందని ఇండియన్ 2 లో పెద్ద చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా ఏమీ ఉండరేమో అని అభిమానులు కంగారుపడుతున్నారు.

కమల్ హాసన్ మాటలతో చాలామంది షాక్ అయ్యారు. తాజాగా కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ మళ్ళీ ఇలాంటి మాటే అన్నారు. నేను ఒకరకంగా స్వార్థంగానే అడుగుతున్నాను. ఇండియన్ 3 సినిమా కచ్చితంగా మీ అందరూ చూడాలి. అందుకని ఆయన ఇండియన్ 2 సినిమాని హిట్ చేయండి” అని అన్నారు కమల్ హాసన్.

ఇండియన్ 3 కోసం హైప్ ఇవ్వాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్నది ఇండియన్ 2 సినిమా. మరి అలాంటిది ఇండియన్ 2 సినిమా గురించి మాట్లాడకుండా ఇండియన్ 3 బాగుంటుంది అది చూడండి అంటుంటే అభిమానులకి సైతం నవ్వొస్తుంది. ఇండియన్ 2 సినిమాలో పెద్దగా ఏమీ ఉండదు అని కమల్ హాసన్ ముందే చెబుతున్నట్లు ఉంది.

ఇదిలా ఉండగా అభిమానులు మాత్రం కమల్ హాసన్ కావాలనే ఇలా చేస్తున్నారు అని, సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోకుండా ఉండడానికి మాత్రమే కమల్ హాసన్ సినిమా మీద అంచనాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కమల్ హాసన్ ప్రమోషన్ల వల్ల సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu