కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్(భారతీయుడు)’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ‘హిందుస్థానీ’ పేరుతో వచ్చిన హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా మంచి విజయం అందుకుంది. అంతే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాగా ‘ఇండియన్’ నిలవడం మరో చెప్పుకోదగిన విషయం.
ప్రజలను పట్టి పీడిస్తున్న అవినీతి గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఇండియన్ 2’ ఒకటి. దర్శకుడు శంకర్ ఇండియన్ పార్ట్ 2తో పాటు పార్ట్ 3 కూడా పూర్తిచేశారంటున్నారు.
శంకర్, కమల్ హాసన్ల కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్’. ఇప్పటికే పార్ట్2, పార్ట్-3కి సంబంధించి 6 గంటల ఫుటేజ్ సిద్ధమైనట్టు సమాచారం. ఇండియన్ 2′ ఇప్పటికే 100 శాంతం పూర్తైనట్లు, ‘ఇండియన్ 3’ మాత్రం 75 శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ‘ఇండియన్ 2’లో ముగింపు లేకుండా సీక్వెల్ కు ఛాన్స్ ఉందనే టాక్ రావడంతో దర్శకుడు శంకర్ స్క్రీన్ ప్లేలో సరైన ఎలివేషన్ పాయింట్లతో ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.