నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ డెవిల్ రూపొందుతోంది. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. కల్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తిచేసే అవకాశముంది.
కల్యాణ్ రామ్ డెవిల్ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో కల్యాణ్ రామ్ డెవిల్ అనే బ్రిటిష్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు శ్రీకాంత్ విస్సా.