నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. శ్రీకాంత్ విస్సా అందించిన కథ ఇది. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి, నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో కల్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘దేవర’ సినిమాపై స్పందించాడు. ఆ సినిమాకి ఆయన ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అందుకు కల్యాణ్ రామ్ స్పందిస్తూ … ‘దేవర’ మొదటి భాగానికి సంబంధించి 80 శాతం షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి ముందుగా చెప్పుకోవలసి వస్తే విజువల్స్ గురించే చెప్పుకోవాలి” అన్నాడు.
“నాకు తెలిసి తెలుగులో అలాంటి విజువల్స్ ను చూడలేదు. అలాంటి విజువల్స్ తెరపై కనిపించడం కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. తమ్ముడు ఎంతో తపనపడ్డాడు. సెట్స్ కోసం .. ఫైట్స్ కోసం విదేశాలకి చెందిన నిపుణులను రంగంలోకి దింపడం జరిగింది. ఇది ఎంతో కష్టంతో .. ఖర్చుతో కూడుకున్న పని. సెట్లోకి అడుగుపెట్టిన నాకు అదో ప్రత్యేకమైన ప్రపంచంలా అనిపించింది. ఈ సినిమా షూటింగును మొదలుపెట్టిన తరువాతనే పార్టు 2 ఆలోచన వచ్చింది” అని చెప్పాడు.