విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “యన్.టి.ఆర్”. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎన్.బి.కే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. “కథానాయకుడు” “మహానాయకుడు”అనే టైటిల్స్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 9న
మొదటి భాగం, జనవరి 24న రెండో భాగం విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ పాత్ర పోషిస్తున్న కల్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. “విజయం మీది.. విజయరథ సారథ్యం నాది.. నీడలా వెన్నంటి ఉంటా నాన్నగారూ..” అంటూ చిత్ర యూనిట్ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా “అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.. నాన్న పాత్రను పోషించడం గర్వంగా, భావోద్వేగంగా ఉంది” అని కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! Feeling proud and emotional about reprising the role of my father in #NTRBiopic pic.twitter.com/wnTwMepbTO
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 18, 2018