తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌పై హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా సంక్రాంతి రోజు విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నాడు కల్యాణ్ రామ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ”తారక్ నాతో నాన్నగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడు. అతడిలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే తారక్‌ని తమ్ముడని పిలవను. నాన్న అని పిలుస్తాను అన్నాడు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నాన్న లేని లోటును తారక్ తీరుస్తున్నాడు.” అని కల్యాణ్ రామ్ తెలిపాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఎంత మంచి వాడవురా సినిమాలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ సంక్రాంతికి విడుదలైన హిట్ చిత్రాల సరసన ఈ చిత్రం నిలిచింది.