మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ మొదటి సినిమా ‘విజేత’తో నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా మరో చిత్రంలో నటించనున్నాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. కాగా, కల్యాణ్ దేవ్ కు ‘విజేత’ చిత్రం ఆశించినంత మార్కెట్ మైలేజీ ఇవ్వని నేపథ్యంలో ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే ‘కండోమ్ ఫ్యాక్టరీ’ అనే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ‘మీనాక్షి’ అనే సినిమా పట్టాలెక్కించాలని ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.