మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కిన్నెరసాని’. ఇక అతి సర్వత్ర వర్జయేత్ అనే దీని ఉప శీర్షిక ఆ ఆసక్తిని మరింతగా పెంచతోంది. అశ్వథ్థామ ఫేమ్ రమణ తేజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా సాయి రిషిక సమర్పాణలో ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్, శుభమ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై
తళ్లూరి రామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ మంచి స్పందన వచ్చింది. తాజాగా న్యూఇయర్ సందర్భంగా చిత్ర టీం కిన్నెరసాని టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో హీరో ఒంటరిగా పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ‘సూర్యుడికే కనిపించని.. నా గుండెలో చితిమంటని.. ఏ మెఘమో అడగాలని.. ఆశించిన కథ నాదని..’ అంటూ మహతి సాగర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది.