HomeTelugu Trendingనేరుగా ఓటీటీలో కల్యాణ్‌ దేవ్‌ 'కిన్నెరసాని'

నేరుగా ఓటీటీలో కల్యాణ్‌ దేవ్‌ ‘కిన్నెరసాని’

kalyaan dhev kinnerasani mo
మెగా అల్లుడు హీరో కల్యాణ్‌ దేవ్‌ నటించిన తాజా చిత్రం ‘కిన్నెరసాని’. సాయి రిషిక సమర్పణలో రమణతేజ డైరెక్షన్‌లో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించారు. ఈ సినిమాను తొలుత ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాడు డైరెక్టర్‌. కానీ జీ5 వారు సినిమా చూసి అగ్రిమెంట్‌ చేసుకునే సమయంలో బిగ్‌ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని అనడంతో థియేటర్స్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు.

జనవరి 26న థియేటర్లలో రిలీజ్‌ చేస్తామన్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే కల్యాణ్‌ దేవ్‌ నటించిన సూపర్‌ మచ్చి పెద్దగా ఆడకపోవడంతో థియేటర్‌లో రిలీజ్‌ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. థ్రిల్లర్‌ మూవీ కిన్నెరసాని జూన్‌ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu