Kalki 2898 AD Review: ప్రతివారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో కొన్ని సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ఇక స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే మాత్రం చిన్న సినిమాలు ఒకటో రెండో తప్ప.. ఎక్కువగా విడుదల అవ్వవు. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు అలా లేవు. ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా విడుదల అవుతుంది.
తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంత పెద్ద సినిమా విడుదల అవుతున్నప్పటికీ ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల కి సిద్ధమవుతున్నాయి.
ఒకటి రెండు కాదు ఏకంగా 12 సినిమాలు ప్రభాస్ కల్కి సినిమాతో పాటు పోటీ పడనున్నాయి. ఇట్లు మీ సినిమా, నింద, మరణం, కల్యాణ వైభోగమే, హనీమూన్ ఎక్స్ ప్రెస్, ఓ మంచి ఘోస్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు, సందేహం, అంతిమ తీర్పు, పద్మవ్యూహంలో చక్రధారి, ప్రేమకథా చిత్రమ్, ఉపేంద్ర ఏ, ఇలా 12 సినిమాలు ఈ వారం విడుదల అవుతున్నాయి. కొన్ని ఆల్రెడీ విడుదల అయిపోయాయి.
అసలే చిన్న సినిమాలు.. మహా అయితే ప్రభాస్ కల్కి సినిమా విడుదల అయ్యేదాకా ఆడగలవు. ఆ తర్వాత కనీసం థియేటర్లు దొరకడం కూడా కష్టం అయ్యే పరిస్థితి. పోనీ విడుదల అయ్యేది మీడియం రేంజ్ హీరో సినిమా అయితే ఏమైనా అవకాశం ఉండేది. కానీ ఇటు విడుదల అవుతున్నది ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ హీరో సినిమా.
అందులోనూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన కల్కి వంటి భారీ స్థాయి సినిమా. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా అభిమానులు కచ్చితంగా సినిమా ఎలా ఉందో చూడటానికి అయినా థియేటర్లకి వెళ్తారు. పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా కాబట్టి థియేటర్ లోనే చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో కల్కి సినిమాకి తప్ప మిగతా సినిమాలకి పెద్దగా కలెక్షన్లు చేసుకునే స్కోప్ కూడా ఉండదు.
ఈ లెక్కన చూస్తే ప్రభాస్ కల్కి సినిమా మిగతా సినిమాలను ఊచకోత కోసినట్లే ఉంటుంది పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో తమ సినిమాని విడుదల చేస్తున్న నిర్మాతల పరిస్థితి ఏంటో చూడాలి.