Kalki 2898 AD Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
నార్త్ లో కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూన్ 19న ముంబైలో చిత్ర బృందం అంగరంగ వైభవంగా నిర్వహించింది. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న స్టార్ నటీనటులందరూ ఈవెంట్ కి హాజరయ్యారు.
అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, ప్రభాస్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, అశ్విని దత్ తదితరులు ఈవెంట్ కు విచ్చేశారు. రానా దగ్గుబాటి ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నారు. ఇక నార్త్ లో సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ సంగతి ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ప్లాన్ చేయడం లేదట. ఈ వార్త అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తుంది. అయితే ఎందుకు చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడం లేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది
ఎలాగో సినిమా మీద చాలా బజ్ ఉంది కాబట్టి.. ప్రత్యేకంగా సినిమాని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని.. దర్శక నిర్మాతలు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారని.. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో విడుదల తేదీ దగ్గరికి వచ్చేస్తోంది కాబట్టి సమయం లేదేమోనని అభిప్రాయపడుతున్నారు.
మరికొందరేమో ఇప్పటికే సినిమా కోసం భారీ బడ్జెట్ ను వెచ్చించారు నిర్మాత అశ్వినీ దత్. ప్రమోషన్స్ లో భాగంగా కూడా వెబ్ సిరీస్, రోబోటిక్ కార్, ఇలా చాలానే డబ్బులు ఖర్చయ్యాయి. ఇక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు అని నిర్మాత ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అని కొందరు చెబుతున్నారు.
ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకచోట చిత్ర బృందం ఒక చిన్న ఈవెంట్ ని నిర్వహించి ఉంటే బాగుండేది అని అభిమానులు చెబుతున్నారు.