Kalki Ticket Rates: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మొట్టమొదటిసారిగా నాగ అశ్విన్ దర్శకత్వంలో నటించిన కల్కి 2898 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్ధమవుతోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, కమల్ హాసన్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది.
అయితే ఎంతైనా స్టార్ హీరో సినిమా కాబట్టి ఈ చిత్ర టికెట్ రేట్ ల గురించి, ప్రీమియర్ల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లు, ప్రీమియర్ల గురించి గత కొంతకాలంగా బోలెడు పుకార్లు వినిపిస్తూ వచ్చాయి. చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాకి సంబంధించిన ప్లాన్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. కల్కి చత్ర బృందం ఆంధ్రప్రదేశ్లో ఒక్కో టికెట్ కి 100 రూపాయలు అదనపు రేట్ కోసం అనుమతి కోరింది. ఇక తెలంగాణ మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు, సింగల్ థియేటర్లలో వంద రూపాయల చొప్పున అదనపు రేట్లు దరఖాస్తు చేసింది చరిత్ర బృందం.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రీమియర్ల గురించి కూడా చాలానే చర్చ జరుగుతోంది. చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 5 గంటల ఆట కోసం పర్మిషన్ పెట్టుకుంది. అయితే అర్ధరాత్రి ఒంటిగంట షోస్ లేకపోవడం వల్ల అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారని చెప్పుకోవచ్చు.
ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లకి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబోతున్నాయని ముందుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్లు సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. మొదటి రోజు నుంచి సినిమా కలెక్షన్ల ఢంకా మోగిస్తుందని అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
Kalki Trailer 2:
ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండవ ట్రైలర్ కూడా ఇప్పుడు ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ట్రైలర్లతోనే సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కోసమైనా సినిమా ఖచ్చితంగా థియేటర్లలో చూడాలని మామూలు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.