HomeTelugu Big StoriesKalki Part 2: కల్కి పార్ట్ 2 షూటింగ్ అప్పుడే సగం పూర్తయిందా

Kalki Part 2: కల్కి పార్ట్ 2 షూటింగ్ అప్పుడే సగం పూర్తయిందా

Kalki 2898AD
Kalki Part 2 shooting update surprises fans

Kalki Part 2: ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ కలెక్షన్లు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇక కల్కి సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో అని ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ గురించి ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలో అని అభిమానులు కంగారు పడుతున్నారు. తాజాగా చిత్ర నిర్మాత అశ్విని దత్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే కల్కి సీక్వెల్ షూటింగ్ 60 శాతం పూర్తి అయిపోయిందట. ఇంకా కేవలం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా పూర్తయి నిర్మాణాంతర పనులు పూర్తయిపోతే సినిమా విడుదలకి సిద్ధం అయిపోతుంది.

అయితే విడుదల తేదీ గురించి మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు అని అశ్వినీ దత్ తెలియజేశారు. దీంతో షూటింగ్ 60 శాతం పూర్తయింది అనడంతో అభిమానులు కూడా కొంత ఊరట చెందుతున్నారు. మరి మిగతా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సినిమాని విడుదల చేస్తే బాగుంటుంది అని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Kalki Part 2:

ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే సీక్వెల్ ఎలా ఉండబోతోంది, ఎవరి పాత్ర ఎలా మారబోతుంది అంటూ బోలెడు ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ పాత్ర గురించి, ప్రభాస్ పాత్ర గురించి బోలెడు పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

దీపిక పడుకొనే హీరోయిన్ గా నటించిన కల్కి 2898 ఏడి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలలో కనిపించారు. విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ వంటి సెలబ్రిటీలు కూడా క్యామియో పాత్రలలో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా కల్కి సీక్వెల్ లో అయినా కృష్ణుడి పాత్రని చూపిస్తారా లేదా అని సందేహాలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu