HomeTelugu Big StoriesKalki part 2: విజయ్ దేవరకొండ కూడా మళ్ళీ పుడతాడు

Kalki part 2: విజయ్ దేవరకొండ కూడా మళ్ళీ పుడతాడు

Kalki part 2
Vijay Devarakonda not a cameo in Kalki part 2

Kalki part 2:

టాలివుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి. ప్రభాస్ హీరోగా, దీపిక పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో క్యామియో పాత్రలు ప్రేక్షకులను చాలా బాగా అలరించాయి.

Kalki part 2:

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ పాత్ర గురించి నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. కల్కి 2 లో విజయ్ దేవరకొండ పాత్ర గురించి చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. కల్కి 2898 ఏడి సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. అయితే కల్కి పార్ట్ 2 లో విజయ్ ఉంటారా లేదా అని సందేహాలు మొదలయ్యాయి.

మళ్లీ మహాభారతం ఎపిసోడ్ ఏమన్నా చూపిస్తే అందులో కూడా క్యామియో పాత్రలో కనిపిస్తారని అందరూ అనుకున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని అడగగా, నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. విజయ్ దేవరకొండ పాత్ర కల్కి లో క్వామియో కాదు కల్కి లో ఒక భాగం అన్నారు.

దీంతో విజయ్ ఫ్యాన్స్ చాలా సంతోషపడ్డారు. అయితే విజయ్ దేవరకొండ సినిమాలో కనిపించాలి అంటే ప్రస్తుతం అంటే సినిమా కథ ప్రకారం 2898 ఏడి లో విజయ్ దేవరకొండ ఉండాలి. ఎలా అయితే కర్ణుడు ప్రభాస్ మళ్ళీ భైరవ లాగా పుట్టాడో అర్జునుడు విజయ్ దేవరకొండ కూడా మళ్ళీ పుట్టాలి. కాబట్టి విజయ్ దేవరకొండ పాత్ర సినిమాలో మళ్ళీ పుడుతుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరి సినిమాలో ఉన్న మూడు ప్రపంచాలని నాగ్ అశ్విన్ చూపించేశారు. అందులో విజయ్ కనిపించలేదు. ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నాలుగో ప్రపంచం కూడా ఉండే అవకాశం ఉంది అన్నారు. మరి అందులో నాగ్ అశ్విన్ కనిపిస్తారా లేక విజయ్ దేవరకొండ మళ్ళీ పుడితే ఎలా ఉంటాడు అని చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అవన్నీ తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఏదేమైనా నాగ్ అశ్విన్ మళ్ళీ విజయ్ దేవరకొండ ను తన సినిమాలోకి తీసుకొచ్చాడు. ఎలాగో కల్కి లో భాగమే కాబట్టి అందులో భాగంగా ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయ్ దేవరకొండ కూడా ఉంటాడు అని చెప్పవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu