HomeTelugu Newsరాజశేఖర్‌ 'కల్కి' ఫస్ట్ లుక్ మోషన్‌ పోస్టర్‌

రాజశేఖర్‌ ‘కల్కి’ ఫస్ట్ లుక్ మోషన్‌ పోస్టర్‌

6సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి’ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. దీన్ని రాజశేఖర్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘కల్కి’ ఫస్ట్‌ అవతార్‌ను విడుదల చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. నా తరఫున, నా కుటుంబ సభ్యులు, చిత్ర బృందం తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ఆయన పోస్ట్‌ చేశారు. చాలా ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రాజశేఖర్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సి.కల్యాణ్‌, శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం రూ.2 కోట్లతో సెట్‌ను ఏర్పాటు చేశారట. 1983 నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజశేఖర్‌ ఇటీవల ‘గరుడవేగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలో పూజా కుమార్, శ్రద్ధాదాస్‌, సంజయ్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu