HomeTelugu Big StoriesKalki 2898 AD: భారతీయుడు 2 మీద పగ పట్టిన కల్కి ఫ్యాన్స్..

Kalki 2898 AD: భారతీయుడు 2 మీద పగ పట్టిన కల్కి ఫ్యాన్స్..

Indian 2
Kalki fans to boycott Indian 2

Kalki Censor Report: ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా అందుకుంటుంది అని.. విడుదలకి ముందే ట్రేడ్ వర్గాలు చెప్పేస్తున్నాయి. సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తూ ఉంటే సినిమా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు.

అయితే ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నప్పటికీ.. ప్రభాస్ అభిమానులు మాత్రం.. తమిళనాడులో సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించే చర్చించుకుంటున్నారు. తమిళ్ ప్రేక్షకులు ఎప్పుడు తెలుగు సినిమాలని అంత భారీ స్థాయిలో ఎంకరేజ్ చేయరు. చాలా వరకు తెలుగులో రికార్డు కలెక్షన్లు అందుకున్న సినిమాలు కూడా.. తమిళనాడులో అంతంతమాత్రంగానే వసూళ్లు చేశాయి.

అయితే కల్కి సినిమా విషయంలో మాత్రం ఇలా జరగకూడదని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ కల్కి సినిమా కనుక తమిళనాడు లో మంచి కలెక్షన్లు అందుకోకపోతే అభిమానులు అందరూ ఇండియన్ 2 సినిమా చూడము అని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ ఏడాదిలో తమిళ్ నుంచి వస్తున్న మొట్టమొదటి భారీ బడ్జెట్ స్టార్ హీరో సినిమా ఇండియన్ 2. అందుకే ప్రభాస్ అభిమానులు అందరూ ఇండియన్ 2 మీదే పగబట్టారు.

కల్కి సినిమా కలెక్షన్లు తమిళనాడులో తక్కువగా ఉంటే మాత్రం.. ప్రభాస్ అభిమానులు రివ్యూస్ ఎంత బాగున్నా కూడా ఇండియన్ 2 సినిమా థియేటర్లను చూడమని, సినిమా ఎంత సూపర్ హిట్ అయినా కూడా ఓటీటీలో మాత్రమే చూస్తాము తప్ప థియేటర్లకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు.

ఒకవేళ కల్కి సినిమా నిజంగానే తమిళనాడులో అంత భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోకపోతే.. నిజంగానే ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాని బాయ్ కాట్ చేసేలాగానే కనిపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారతీయుడు 2 లో హీరోగా నటిస్తున్న కమల్ హాసన్ కల్కి సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు.

More about Kalki 2898 AD:

వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు 20 మందికి పైగా స్టార్ నటీనటులు ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu