Kalki Characters Screentime:
ప్రభాస్ తో పాటు కల్కి 2898 ఏడి సినిమాలో చాలామంది స్టార్ యాక్టర్స్ నటించారు. మరి ఒక్కొక్కళ్ళు వెండి తెర మీద ఎంత సేపు కనిపించారో తెలుసా..
Kalki Characters Screentime:
Kamal Haasan screentime in Kalki: సుప్రీమ్ యాస్కిన్ అనే మెయిన్ విలన్ పాత్రలో కమల్ హాసన్ ఈ సినిమాలో 7 నిమిషాల 4 సెకండ్లు మాత్రమే కనిపిస్తారు. కానీ కమల్ హాసన్ నటన, డైలాగ్ డెలివరీ ఇచ్చిన ఎఫెక్ట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పచ్చు.
Disha Patani screentime in Kalki: రాక్సీ పాత్రలో దిశా పటాని పది నిమిషాల 24 సెకండ్లు తెర మీద కనిపిస్తుంది. ప్రభాస్, దిశా ల మధ్య ఒక పాట కూడా ఉంటుంది. అది కూడా బాగానే హైలైట్ అయ్యింది. ఆమె పాత్ర కొంచెం లాగ్ లాగానే అనిపిస్తుంది. ఈ పాటలోనే డైరెక్టర్ అనుదీప్ కేవీ కూడా క్యామియో ఇస్తారు.
Deepika Padukone screentime in Kalki: కల్కి కి జన్మని ఇవ్వబోయే అమ్మ సుమతీ పాత్రలో నటించిన దీపికా పడుకొనే ఈ సినిమాలో 23 నిమిషాల 42 సెకండ్లు కనిపిస్తుంది. సినిమా మొత్తం మీద ఇంటర్వెల్ బ్యాంగ్ లో దీపిక పడుకొనే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది.
Amitabh Bachchan screentime in Kalki: సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద 25 నిమిషాల 19 సెకండ్లు కనిపిస్తారు.
Prabhas screentime in Kalki:
భైరవ అలియాస్ కర్ణుడి పాత్రలో ప్రభాస్ తెరమీద కనిపించింది తక్కువగా ఉంది అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ ఎక్కువగా కనిపించారు అని కూడా అన్నారు. అయితే అందులో నిజం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ అందరికంటే ఎక్కువగానే వెండి తెర మీద కనిపించారు. సినిమా మొత్తం మీద ఒక గంట రెండు నిమిషాల 25 సెకండ్లు ప్రభాస్ తెర మీద కనిపిస్తారు.
కమర్షియల్ సినిమాల ప్రకారంగా అయితే హీరో నిడివి తక్కువే కానీ అన్నీ పాత్రలకి సమాన విలువ దక్కిన సినిమా ఇది. కాబట్టి పర్వాలేదు అని చెప్పచ్చు. అయితే పేరుకు గంట అయినా కూడా ప్రభాస్ ని అసలు చూసినట్టే అనిపించలేదు అని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.