Kalki 2898 AD Tickets: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్లు అందుకుంటుంది. సినిమా విడుదల అయ్యి రోజులు గడుస్తున్నా కూడా కలెక్షన్లు మాత్రం ఇంకా స్టడీ గానే ఉన్నాయి.
అయితే ఈ సినిమా విడుదలకి ముందే చిత్రబృందం అటు తెలంగాణలో మాత్రమే కాక ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు పర్మిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి నిర్మాత అశ్విని దత్ సినిమా విడుదలయ్యాక 10 రోజులపాటు టికెట్ రేట్లు ఎక్కువ ఉండేలాగా పర్మిషన్ అడిగారు.
ప్రభుత్వం నుంచి కూడా అంగీకారం రావడంతో టికెట్ రేట్లు పెరిగాయి. కానీ సినిమా టాక్ చాలా బావుండడంతో మరికొద్ది రోజులపాటు కూడా థియేటర్లు నిండు గానే ఉండేలాగా అనిపిస్తున్నాయి. దీనిని కూడా క్యాష్ చేసుకోవాలి అనుకున్న నిర్మాతలు మరొక నాలుగు రోజులు టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరారు.
Kalki 2898 AD Tickets:
ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ఇంకా ఎన్నిరోజులు కల్కి టికెట్ రేట్లు పెంచుతారు అంటూ కోర్టును నిలదీసిన ఒక వ్యక్తి టికెట్ రేట్లు తగ్గించాలి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాకుండా అసలు కల్కి సినిమా అని మాత్రమే కాకుండా ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచే హక్కు నిజంగానే ప్రభుత్వానికి ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు.
దీంతో కోర్టు నిర్మాత అశ్విని దత్ కి కూడా నోటీసులు పంపింది. ఆ వ్యక్తి ఫైల్ చేసిన పిటిషన్ కి వెంటనే కౌంటర్ ఫైల్ చేయాలి అంటూ అశ్విని దత్ కి నోటీసులు జారీ చేసింది కోర్టు. ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు తగ్గించడం తప్ప నిర్మాత దగ్గర మరొక ఆప్షన్ లేదు. ఏదేమైనా సినిమా విడుదలై వారం రోజులు గడిచింది. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ కూడా వస్తుంది. కాబట్టి టికెట్ రేట్లు తగ్గించినా కూడా పెద్దగా కలెక్షన్లకు నష్టమేమీ జరగదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.