ఏపీ ఎలక్షన్స్ ఫలితాలు విడుదల కావడంతో.. ఎలక్షన్స్ జోరు ఇక ఆంధ్రప్రదేశ్లో సద్దుమణిగిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి సినిమాల పైన పడింది. ఎలక్షన్స్ పుణ్యమా అని ఎన్నో రోజుల నుంచి.. సినీ ప్రేక్షకులకు అసలు పెద్ద సినిమాలు లేకుండా పోయాయి. ఎలక్షన్స్ ముందు విడుదల చేయడం ఇష్టం లేక ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అలాంటి సినిమాలలో మొట్టమొదటి సినిమా ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898AD..
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా అశ్వినీ దట్ పక్కా టిడిపి వాది అన్న సంగతి తెలిసిందే. ఎలక్షన్స్ ముందు సినిమా సెలబ్రిటీస్ ఎవరు ముందుకు రాకపోయినా.. అశ్వినీ దత్ పక్కాగా టిడిపికి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు వైసిపివాదులు ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ని బెదిరించారు. ఈసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని.. కల్కి సినిమా టికెట్ రేట్లు తగ్గించడం ఖాయమని కొంతమంది కామెంట్లు పెట్టగా మరి కొంతమంది అసలు కల్కి సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తాము అంటూ బెదిరించసాగారు.
అయితే వైసిపి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. టిడిపి విజయకేతనం ఎగరవేసింది. దీంతో సినీ సెలబ్రెటీస్ లో ముందుగా ఆనందించేవారు ఎవరు అంటే అందరూ అశ్వినీ దత్ అని అంటూ కామెంట్స్ పెట్టసాగారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్ల విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన తీరు అప్పట్లో టాలీవుడ్ లో ఎంతోమందికి నిరాశకు గురిచేసింది. ఇక ఎప్పుడూ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత మొదటగా విడుదల కాబోతున్న చిత్రం కల్కి 2898AD. ఒకపక్క భారీ బడ్జెట్ సినిమా.. మరోపక్క సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దట్ చంద్రబాబు నాయుడుకి ఎంతో ఆప్తుడు. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల విషయంలో జగన్ లాగా చంద్రబాబు ప్రవర్తించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు కల్కి సినిమా టికెట్స్ రేట్ విషయంలో.. అశ్విని దట్ కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్ర టిక్కెట్ రేట్లు ఆకాశాన్ని అంటనున్నాయా అని చాలామందిలో అనుమానాలు ఉన్నాయి.
అంతేకాకుండా నిజంగానే అనుకున్నట్లు టికెట్ రేట్స్ ఎక్కువగా పెంచితే.. ప్రభాస్ రికార్డులు సైతం బద్దలు కోటడం ఖాయం అంటున్నారు అభిమానులు.