Ashwini Dutt: టాలీవుడ్ లో.. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అప్పుడు.. టిడిపి నేత చంద్రబాబు నాయుడు వెనుక స్ట్రాంగ్ గా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నారు అంటే.. అది తప్పకుండా అశ్వినీ దత్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ ప్రొడ్యూసర్.
తెలుగు సినిమా చరిత్రలో.. ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు ఈ వైజయంతి మూవీస్ అధినేత. ఇక సినిమాల విషయం పక్కనబెడితే.. మొదటినుంచి అశ్వినీ దత్.. నందమూరి ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు. సీనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టిన దగ్గర నుంచి.. ఆ పార్టీకి ప్రత్యక్షంగా అన్న.. పరోక్షంగా అన్న సపోర్ట్ చేస్తూనే వచ్చాడు.
ఇక మొన్న 2024 ఎలక్షన్స్ లో టిడిపికి డైరెక్ట్ గానే తన సపోర్ట్ చెప్పుకొచ్చారు. అప్పుడు ఎంతోమంది వైసీపీ వాదులు.. కల్కి సినిమా విడుదల ఆపేస్తాము అని బెదిరించిన.. ఆయన కొంచెం కూడా పట్టించుకోలేదు. కూటమి ఈ ఎలక్షన్స్ లో తప్పకుండా విజయం సాధిస్తుంది అని తన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ నిర్మాతకు.. త్వరలోనే టిడిపి ప్రభుత్వం ఒక కీలక పదవి ఇవ్వనుందని తెలుస్తోంది.
అసలు విషయానికి వస్తే.. మొన్న ఎలక్షన్ ఫలితాలు బయటికి రాగానే.. టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..తన పదవికి.. రాజీనామా చేసాడు. దీంతో ఈ పదవి సినీ పరిశ్రమలో.. ఒక స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఆ నిర్మాత మరెవరో కాదని.. అశ్వినీదత్ అని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో.. ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయం తెలియాల్సి ఉంది.