HomeTelugu Big StoriesKalki 2898 AD part 2: కల్కి పార్ట్ 2 లో ఆ గోల ఉండదు అంటున్న నాగ్ అశ్విన్

Kalki 2898 AD part 2: కల్కి పార్ట్ 2 లో ఆ గోల ఉండదు అంటున్న నాగ్ అశ్విన్

Kalki 2898 AD part 2
Kalki 2898 AD part 2 to have more screen time for Prabhas

Kalki 2898 AD part 2:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అభిమానుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ సినిమా పేరునే కలవరిస్తున్నారు. విడుదల కి ముందు నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల అయ్యాక కూడా అంతే రేంజ్ కలెక్షన్లు అందుకుంటుంది.

సినిమా రెండవ భాగం కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సినిమా మాత్రం విడుదలై ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా కలెక్షన్లు భారీగా పెరుగుతూనే వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలలో కనిపించిన ఈ సినిమాలో చాలామంది స్టార్లు క్యామియో పాత్రలలో కూడా కనిపించారు.

సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం కొంతవరకు నిరాశ చెందారని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాలు ప్రభాస్ కంటే ఎక్కువ మిగతా పాత్రలు కనిపిస్తాయి. ప్రభాస్ ఎంత హీరో అయినప్పటికీ స్క్రీన్ టైం కేవలం గంట మాత్రమే ఉంటుంది. మూడు గంటల సినిమాలో ప్రభాస్ కేవలం గంట మాత్రమే తెరమీద కనిపించారు.

కనీసం కల్కి 2 లో అయినా ప్రభాస్ ఎక్కువసేపు కనిపిస్తారా అని అభిమానులు ప్రశ్నించారు. తాజాగా నాగ్ అశ్విన్ ఈ ప్రశ్నకి రియాక్ట్ అయ్యారు. “కల్కి 2 లో ప్రభాస్ కి ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. ఎలాగో కల్కి ప్రపంచం గురించి అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి వివరించే గోల ఉండదు. ఏదైనా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కల్కిలో పాత్రలేంటి ప్రపంచాలేంటి అని తెలిసిపోయింది కాబట్టి కల్కి 2 ఇంకా ఫన్ గా ఉండబోతోంది” అని అన్నారు నాగ్ అశ్విన్.

ఇక కల్కి 2 సినిమా స్క్రాచ్ నుంచి ఈ మొదలు పెట్టాలని చెప్పి షాక్ ఇచ్చారు. చూస్తూ ఉంటే కల్కి 2 రావడానికి చాలా కాలమే పట్టేలాగా కనిపిస్తోంది. ఇక కల్కి లో విజయ్ దేవరకొండ ఒక భాగం అని క్యామియో మాత్రమే కాదు అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.

కల్కి 2 లో కచ్చితంగా నాని, నవీన్ పోలిశెట్టి లని కూడా ఏదో ఒక పాత్రలో తీసుకొస్తానని చెప్పిన నాగ్ అశ్విన్ కల్కి లో ఎన్ని భాగాలు వచ్చిన శ్రీకృష్ణుడి పాత్రలో ఎవరిని చూపించే ఆలోచన లేదని మాత్రం చెప్పి అభిమానులను నిరాశపరిచారు నాగ్ అశ్విన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu