Kalki 2898 AD: పాన్ ఇండియా హీరో.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898AD’. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, దీశా పటానీ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు ఆయా పాత్రలు పోషించనున్నారు. భవిష్యత్ కాలాన్ని ప్రతిబించించేలా ఆయన ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు, ఆరువేల సంవత్సరాల బ్యాక్ కి ముడిపెడుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.
ఈ క్రమంలో కృష్ణుడు, విష్ణువు కాలం నాటి కథని, భవిష్యత్‌ని చూపించబోతున్నారు. ఈ క్రమంలో సినిమాలోని పాత్రల పేర్లు కూడా అలానే ఉండటం విశేషం. ఇప్పటికే ఇందులోని ప్రభాస్ పాత్రని పరిచయం చేశారు. భైరవగా ఆయన కనిపించబోతున్నట్టు తెలిపారు. ఆయన లుక్ విడుదల చేశారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పాత్రని పరిచయం చేశారు. ఇక సినిమాలో అమితాబ్ బచ్చన్.. `అశ్వత్థామ` పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు అశ్వత్థామ ఈ గ్లింప్స్ లో తెలిపారు.
దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే టెక్నికల్ గా కూడా కల్కి హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమయింది. తాజాగా రిలీజ్ చేసిన అమితాబ్ గ్లింప్స్ లో షాట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓ షాట్ లో అమితాబ్ యంగ్ లుక్ లో కనిపిస్తారు. ఆ లుక్ లో అచ్చం అమితాబ్ యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు.
ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై, ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి అమితాబ్ గ్లింప్స్ లో అమితాబ్ ను డీ-ఏజింగ్ టెక్నాలజీతో పర్ఫెక్ట్ యంగ్ గా చూపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు కల్కి టీమ్. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ను అమితాబ్ ఫ్యాన్స్ కూడా పొగిడేస్తున్నారు.
ఇదిరా గ్రాఫిక్స్ అంటూ, ఎంత లేట్ అయినా పర్లేదు సినిమా ఇలా ఫుల్ క్వాలిటీగా ఉండాలని నాగ్ అశ్విన్ ని పొగిడేస్తూనే మరోసారి ఆచార్య, ఆదిపురుష్ సినిమాలని విమర్శిస్తున్నారు. ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తున్న చూస్తున్నారు. మే9 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నికల కారణంగా మరోసారి వాయిద పడే అవకాశలు కనిపిస్తున్నాయి. దీనిపై కల్కి ప్రొడ్యూసర్లు రీసెంట్గా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారట.
ఈ మీటింగ్‌లో మెయిన్‌గా సినిమా విడుదలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో మూవీటీమ్ రిలీడ్ డేట్‌పై ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. అయితే తాజాగా విడుదలైన వీడియోలోనూ రిలీజ్ డేట్‌ను వెల్లడించలేదు మేకర్స్. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతునన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.