Kalki 2898 AD:పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారురు. 600 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టత్మికంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రభాస్ 200 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడట. ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్స్ భాగం కానున్నారు. కాగా మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమూవీ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.
అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, మరియు దిశా పటాని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో అమితాబ్.. అశ్వత్థామగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన 18 కోట్లు రితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇటీవలే విడుదలైన అమితాబ్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. దీని ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఆయన యంగ్‌లుక్‌పై నెటిజన్లు ప్రంశసలు కురిపించారు.
విశ్వనటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం కమల్ హాసన్‌కి మేకర్స్ రూ.50 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల అవుతుండటంతో కమల్ హాసన్ పాత్ర చాలా ముఖ్యమని మేకర్స్ భావించారట. అందుకే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కమల్ హాసన్‌కి అన్నీ కోట్లు ఇచ్చినట్లు టాక్.
దీపికా పదుకొనె ఈ సినిమాలో పద్మ అనే పాత్రలో నటించనుందట. అంతే కాదు ఈ సినిమాలో దీపికా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్తుందని అంటున్నారు. ఇందుకోసం తెలుగు నేర్చుకుంటుందట. ఈ సినిమాలో దీపికా పాత్ర చాలా బలంగా ఉంటుందట. ఈ పాత్ర కోసం దీపికా 20 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిన్నట్లు తెలుస్తుంది. దిశా పటాని 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ విధంగా చూస్తే కేవలం నటీనటుల పారితోషకం క్రిందకే.. 250 కోట్లు పొతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో భారీ వీఎఫ్ఎక్స్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్పూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.