HomeTelugu Big StoriesKalki 2898 AD: మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు

Kalki 2898 AD: మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు

Kalki 2898AD
Kalki 2898 AD: Facts about Prabhas starrer probably you never knew

Kalki 2898 AD Interesting Facts: భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా విడుదలైంది. విడుదల కి ముందు నుంచి బోలెడంత హైప్ అందుకున్న ఈ సినిమా చూడటానికి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా చూసే ముందు ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకోండి.

Kalki 2898 AD Amitabh Bachchan:

*సినిమా సెట్స్ లో ఉన్న నటులందరిలోనూ ఎక్కువ వయసు ఉన్న నటుడు మరెవరో కాదు అమితాబ్ బచ్చన్. ఆయన వయసు 81 సంవత్సరాలు. చూడటానికి కూడా అలా కనిపించని అమితాబ్ వయసు తో సంబంధం లేకుండా తన పాత్రలకు ప్రాణం పోస్తారు.

*ఇప్పుడు 1985లో గిరఫ్తార్ అనే హిందీ సినిమాలో కమల్ హాసన్ తో కలిసి నటించిన అమితాబ్ బచ్చన్ దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాలో కలిసిన నటించనున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్ అనే పాత్రలో కనిపించనున్నారు.

Kalki 2898 AD Heroines:

*బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. తెలుగులో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇది.

*నాగ్ అశ్విన్ గతంలో దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లోనూ కనిపించిన మాళవిక నాయర్ ఈ సినిమాలో కూడా ఉత్తర పాత్రలో కనిపించనుంది.

*దాదాపు 18 సంవత్సరాల తర్వాత అలనాటి స్టార్ నటి శోభన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. చాలాకాలం తర్వాత ఆమెను వెండి తెర మీద చూడబోతున్నందుకు అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

Kalki 2898 AD Facts:

*కల్కి సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 2డీ ఫార్మాట్ లో మాత్రమే కాక ఈ చిత్రం త్రీడీ, ఐమాక్స్ ఫార్మాట్ లలో కూడా విడుదలైంది.

*సినిమా షూటింగ్ కోసం ఐమాక్స్ డిజిటల్ కెమెరా లను వాడారు. యారి అలెక్స్ 65, యారి డిఎన్ఏ లెన్స్ లను వాడి 6.5 కే రిజల్యూషన్ తో ఈ సినిమాను చిత్రీకరించారు. అందుకే సినిమాని ఐమాక్స్ లోకి మార్చడం కూడా చాలా ఈజీ అయిపోయింది.

Kalki 2898 AD Trailer:

*ఈ సినిమా ట్రైలర్ లో ఒకరు 6000 సంవత్సరాల క్రితం కనిపించిన ఆ పవర్ మళ్ళీ వచ్చిందంటే.. అని అంటారు. 2898 ఏడికి ఆరు సంవత్సరాల ముందు అంటే 3102 సంవత్సరం. శ్రీకృష్ణుడి అవతారం ముగిసిన సంవత్సరం కూడా అదే.

Kalki 2898 AD Bujji:

*ఈ సినిమాలో ప్రభాస్ నడిపిన రోబోటిక్ కార్ బుజ్జి తయారీ కోసం అక్షరాల నాలుగు కోట్లు ఖర్చయింది.

*మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్, కోయంబత్తూర్ లోని జయం ఆటో ఇంజనీరింగ్ వారు ఈ కారును సృష్టించారు.

*సినిమాలో ఈ కార్ కి మహానటి బ్యూటీ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా సినిమాపై మరింత బజ్ పెంచింది.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu