టాలీవుడ్ చందమామ (అక్టోబర్30) ముంబైలోని తాజ్ హోటల్ లో అత్యంత సన్నిహితుల మధ్య గౌతమ్ కిచ్లూను పెళ్లడిన సంగతి తెలిసిందే. రెడ్ కలర్ లెహెంగాను ధరించి, అప్సరసలా కనిపించింది కాజల్. ఇదిలా వుంటే కొత్త వరుడు గౌతమ్ కిచ్లూ ఆదివారం కాజల్ మోనోక్రామ్ పిక్చర్ షేర్ చేస్తూ శ్రీమతి కిచ్లు లా ఆమెని మేల్కొల్పానని` కామెంట్ పెట్టడం ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో కాజల్ నాన్ గ్లామర్ గా .. చెరిగిన జుట్టుతో టీషర్ట్ లో కనిపించడం నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా పెళ్లి తరువాత మొదటిసారిగా భర్తతో ఫొటో షూట్ చేసింది ఈ బ్యూటీ. పసుపు రంగు చీరతో దేవకన్యలా వుంది. ఈ ఫొటోలు సోషల్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.